
- సీఎం ఆమోదం తర్వాతే ధరణిలో కొత్త మాడ్యూల్స్
- మార్పులపై రిపోర్ట్ ఇచ్చిన సబ్ కమిటీ
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. పోర్టల్‌లో చేర్చాల్సిన కొత్త మాడ్యూల్స్‌పై చర్చించినట్లు తెలిసింది. నవంబర్ 12న మొదటిసారి సమావేశమైనప్పుడే సుమారు 20 రకాల సమస్యలు సబ్ కమిటీ దృష్టికి రాగా.. రెండో సమావేశంలో మరికొన్ని కొత్త సమస్యలు వచ్చాయి. పలు సమస్యల పరిష్కారానికి మాడ్యూల్స్ రెడీ చేయగా.. అందుకు సంబంధించిన రిపోర్టును సబ్ కమిటీ ఆమోదించి గురువారం రాత్రి సీఎం కేసీఆర్‌కు సమర్పించినట్లు తెలిసింది. సీఎం వీటికి ఓకే చెబితే ధరణిలో సమస్యలకు త్వరలో పరిష్కారం లభించే చాన్స్ ఉంది.