
ఓటీటీ దగ్గర సినిమాల సందడి పెరుగుతోంది. కొన్ని సినిమాలు నేరుగా రిలీజవుతుంటే.. థియేటర్‌లో రిలీజైన కొన్ని చిత్రాలు స్ట్రీమింగ్‌కి వస్తున్నాయి. రేపు చాలా సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ‘చెక్’ రేపటి నుంచి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ కానుంది. రకుల్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ సాధించకపోయినా మంచి ప్రయత్నంగా మెప్పు పొందింది. రానా ఎక్స్‌పెరిమెంటల్ మూవీ ‘అరణ్య’ కూడా జీ5 ద్వారా అందుబాటులోకి వస్తోంది. గత నెలలో థియేటర్లలో రిలీజై హిట్ కొట్టిన ‘కర్ణన్’ సినిమా రేపు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ధనుష్ హీరోగా మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం క్యాస్టిజం చుట్టూ తిరుగుతుంది. ఇక విజయ్ సేతుపతి, రాశీఖన్నా, నివేదా పేతురాజ్ నటించిన ‘సంగతమిళన్’ మూవీ ‘విజయ్ సేతుపతి’ పేరుతో రేపు ఆహాలో విడుదలవుతోంది. అలాగే రాజ్, డీకేల నిర్మాణంలో రూపొందిన ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘సినిమా బండి’ రేపు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ రానుంది. ఓ పల్లెటూరి ఆటోడ్రైవర్‌కి కెమెరా దొరికితే దానితో సినిమా తీయాలని అతడు చేసే ప్రయత్నాలే ఈ సినిమా. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డచ్ చిత్రం ‘ఫెర్రీ’ కూడా రేపు నెట్‌ఫ్లిక్స్ ద్వారానే విడుదలవుతోంది. నెదర్లాండ్స్‌లోని డ్రగ్ దందాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. మొత్తంగా ఈ వీకెండ్‌కి ఓటీటీ ప్రేక్షకులకి వినోదాల విందు దొరకనుంది.