V6 News

నూతన పార్లమెంట్ పేరు ఇదేనా... మదర్ ఆఫ్ డెమోక్రసీలో ఎన్నో ప్రత్యేకతలు..

నూతన పార్లమెంట్ పేరు ఇదేనా... మదర్ ఆఫ్ డెమోక్రసీలో ఎన్నో ప్రత్యేకతలు..

'మదర్ ఆఫ్ డెమోక్రసీ ప్రారంభానికి సిద్ధమైంది. మే 28వ తేదీన చారిత్రాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే ఈ కొత్త పార్లమెంట్ భవానానికి ఇంకా ఏ పేరును కేంద్రం ఖరారు చేయలేదు. దీంతో నూతన పార్లమెంట్ భవానానికి ఏ పేరు పెడతారు అన్న చర్చ మొదలైంది. అంతేకాకుండా కొత్తగా నిర్మించిన పార్లమెంట్లో ఎన్ని ద్వారాలున్నాయి. ఆ ద్వారాలకు ఏ పేర్లు పెట్టారని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 

ప్రముఖుల విగ్రహాలు..

నూతన పార్లమెంట్ భవనం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మాగాంధీ, చాణిక్యుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో సహా ప్రముఖుల విగ్రహాలు ఉంటాయని  ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా కొత్త పార్లమెంట్ భవనానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయట. ఈ ప్రవేశ ద్వారాలకు చారిత్రక అంశాలను మేళవించారట. ఈ  ప్రధాన ప్రవేశ ద్వారాలకు కూడా పేర్లు పెట్టారని తెలుస్తోంది. 

ప్రవేశ ద్వారాకు ప్రత్యేక పేర్లు..

కొత్త పార్లమెంట్ భవనంలో మూడు ప్రధాన ద్వారాలుంటాయి. వాటికి ప్రత్యేక పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది.  జ్ఞాన ద్వారం..శక్తి ద్వారం.. కర్మ ద్వారాలుగా నామకరణం చేశారు. జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి, యాజ్ఞవల్క్య మహర్షి మధ్య జరిగిన సంభాషణ దృశ్యం, మరోవైపు నలంద చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. శక్తి ద్వారానికి ఒక వైపున చాణిక్య, మరోవైపు మహాత్మాగాంధీ దండియాత్ర దృశ్యాలు ఉండనున్నాయి. కర్మ ద్వారానికి ఒకవైపు కోణార్క్ చక్రం, మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.  

నూతన పార్లమెంట్ పేరేంటి..

కేంద్ర ప్రభుత్వం 2022  సెప్టెంబర్లో రాష్ట్రపతి భవన్ కు వెళ్లి చారిత్రాత్మక రహదారి రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా మార్చింది.  ఈ క్రమంలో కొత్త పార్లమెంట్ భవనానికి కూడా కొత్త పేరు పెట్టనున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే పార్లమెంట్ హౌజ్ అని పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంత వరకు ఏ పేరును మాత్రం ఖరారు చేయలేదు. మరోవైపు నూతన పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం సెంగోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సెంగోల్  స్పీకర్ కుర్చీ వద్ద ఏర్పాటు చేస్తున్నారు.  నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.