TRAI కొత్త రూల్స్.. మే నుంచి అమల్లోకి

TRAI కొత్త రూల్స్.. మే నుంచి అమల్లోకి

ఫేక్, స్పామ్ కాల్స్, మెసేజెస్.. ఈ మధ్య చాలామందిని విసిగిస్తున్న సమస్య. వీటినుండి తప్పించుకోవడానికి రకరకాల యాప్స్ వాడుతుంటారు. సెట్టింగ్స్ ను ఎనేబుల్ చేస్తుంటారు. ఒక్క క్లి్క్ నొక్కి వీటివల్ల  నష్టపోయిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే, వీటిని పర్మినెంట్ గా బ్లాక్ చేయడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త రూల్స్ ను జారీ చేసింది. వీటిని మే నెల నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
 
అన్ని టెలికాం కంపెనీలు ఏఐ ఫిల్టర్ ను తప్పనిసరిగా వాడాలని ట్రాయ్ ఆదేశించింది. దీంతో త్వరలో తమ తమ నెట్వర్క్ ల్లో ఏఐ ఫిల్టర్ ఆప్షన్ ను తీసుకొస్తామని జియో, ఎయిర్టెల్ ప్రకటించాయి. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపాయి. కాల్స్, ఎస్సెమ్మెస్ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పామ్ ఫిల్టర్‌ను తప్పనిసరిగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది ట్రాయ్.