రామ్‌‌, బోయపాటి మూవీ : రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్‌‌

రామ్‌‌, బోయపాటి మూవీ :  రామోజీ ఫిల్మ్ సిటీలో  కొత్త షెడ్యూల్‌‌

రామ్‌‌ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ తెరకెక్కుతోంది. రామ్‌‌కి ఇది ఇరవయ్యవ సినిమా కావడంతో ‘ర్యాపో 20’ వర్కింగ్ టైటిల్‌‌తో రూపొందిస్తున్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్‌‌ను పూర్తిచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిన్న కొత్త షెడ్యూల్‌‌ను మొదలుపెట్టారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌తో షూటింగ్‌‌ను స్టార్ట్ చేశారు. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్‌‌కు స్పెషల్ క్రేజ్ ఉండటంతో.. యాక్షన్ కొరియోగ్రాఫర్  స్టన్ శివ డిఫరెంట్ ఫైట్స్‌‌ను డిజైన్ చేస్తున్నాడట. 

ఈ సాలిడ్  సీక్వెన్సెస్ గూస్‌‌ బంప్స్‌‌ తెప్పించేలా శివకు కొన్ని ఇన్‌‌ పుట్స్‌‌ కూడా ఇచ్చాడట బోయపాటి. ఈ సీన్స్ ప్రేక్షకులకు విజువల్‌‌ ట్రీట్‌‌లా ఉంటుందంటున్నారు. శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇతర నటీనటుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల చేయనున్నారు.