ఏ.కే.రావు మృతి కేసు: ఘటన స్థలంలో కత్తి, బ్లేడ్

ఏ.కే.రావు మృతి కేసు: ఘటన స్థలంలో కత్తి, బ్లేడ్

ప్రముఖ సింగర్ హరిణి తండ్రి ఏ.కే.రావు మృతదేహంను బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్‌పై పోలీసులు గుర్తించారు.  ఏకే రావు ఆత్మహత్య కేసుపై FiR లోని అంశాలను మీడియాకు వివరించారు పోలీసులు. "నాందేడ్ ఎక్స్ ప్రెస్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలం కు చేరుకున్నాం. యాలహంకా రైల్వే ట్రాక్ పైన బోర్ల పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించాము. తల ఎడమ వైపు ఆరు సెంటిమీటర్లు గాయమైంది. ఎడమ చేతికి, గొంతుపై గాయాలు ఉన్నాయి. ఘటన స్థలంలో చాకు, కత్తి, బ్లెడ్ ని స్వాధీనం చేసుకున్నాం. పోస్టుమార్టం కోసం ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించాము. మృతుడి దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము.  మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి, తన తండ్రి మృత దేహం అని గుర్తించాడు. ఓ ప్రాజెక్ట్ పని మీద అప్పుడప్పుడు బెంగళూర్ వచ్చేవాడు. ఈ నెల 8 తేదీన బెంగళూరుకు వచ్చి, ఏకే రావు తన కొడుకు ఇంట్లో ఉన్నాడు. 23 తేదీన ఏకే రావు భార్య బెంగళూర్ లో ఉన్న కుమారుడు కి ఫోన్ చేసింది. యశ్వంత్ పూర్ రైల్వే పోలీస్ నుండి నాకు ఫోన్ వచ్చిందని ..రైల్వే ట్రాక్ పై మీ భర్త చనిపోయాడని పోలీసులు చెప్పారని కుమారుడుకి సమాచారం ఇచ్చింది. 

ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్ పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూర్ రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ముందుగా 174 ( C)   CRPC సెక్షన్ ల ప్రకారం కేసు నమోదు చేశాము. ఇప్పుు ఐపీసీ 302, 201 కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నాం". అని పోలీసులు తెలిపారు.


ఏకే రావు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే గత వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లారో స్పష్టత రాలేదు. కానీ హఠాత్తుగా ఆయన మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది. అయితే తన తండ్రిది ఖచ్చితంగా హత్యేనని సింగర్ హరిణి అనుమానిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరిణి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా ఏకే రావు మృతదేహం రైల్వే ట్రాక్‌పై దొరికిన తర్వాత అప్పటి వరకూ ఆచూకీ లేని కుటుంబసభ్యులు బెంగళూరులోని మార్చురీ వద్దకు వెళ్లారు. తమ ఫిర్యాదు కూడా పోలీసులకు ఇచ్చారు.

ఏకే రావు కుటుంబసభ్యుల మధ్య మధ్య ఏమైనా కుటుంబ గొడవలు ఉన్నాయా అనే దిశగా బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏకే రావు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అన్నది పోస్ట్ మార్టంలో తేలే అవకాశం ఉంది. ఏకే రావు కుమార్తె సింగర్ హరిణి మాత్రం ఖచ్చితంగా హత్యేనని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్‌కు ఏకే రావు చాలా కాలంగా సీఈవోగా పని చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన ఏదైనా వివాదాలు ఉన్నాయా అనే దిశగానూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక అవకతవకల విషయంలో ఇప్పటికే సుజనా చౌదరిపై సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. చనిపోయిన ఏకే రావు ఎంపీ అయిన సుజనా చౌదరికి చెందిన సంస్థకు సీఈవోగా ఉండటం.. ఏకే రావు కుమార్తె ప్రముఖ సింగర్ కావడంతో ఈ వ్యవహారం సంచలనాత్మకం అవుతోంది. తన తండ్రి చావుకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని హరిణి డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూర్ రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు పోలీసులు.