జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కొత్త రకం ఓటర్ స్లిప్పులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కొత్త రకం ఓటర్ స్లిప్పులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కొత్త రకం ఓటర్​ప్లిప్ లు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్‌‌‌‌ ఆర్వీ.కర్ణన్‌‌‌‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్‌‌‌‌ స్లిప్‌‌‌‌లపై ఓటర్ల సీరియల్‌‌‌‌ నంబర్‌‌‌‌, పార్ట్‌‌‌‌ నంబర్‌‌‌‌ ను పెద్ద అక్షరాలతో చదవడానికి వీలుగా ముంద్రించనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్‌‌‌‌ కేంద్రాల్లో గందరగోళం లేకుండా ఓటర్లు తమ వివరాలను ఈజీగా గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువస్తోందన్నారు.