జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్‌‌‌‌‌‌‌‌లే టార్గెట్‌‌‌‌‌‌‌‌

జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్‌‌‌‌‌‌‌‌లే టార్గెట్‌‌‌‌‌‌‌‌

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌: కరోనాతో సతమతమవుతున్న ప్రపంచ దేశాలు దాన్నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్లను కనుగొన్నాయి. కానీ వైరస్‌‌‌‌‌‌‌‌ మార్పు చెందుతూ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. పైగా కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీలో అనేక రకాలున్నాయి. ఇప్పటికే కరోనా సార్స్‌‌‌‌‌‌‌‌కోవ్‌‌‌‌‌‌‌‌2 విజృంభిస్తుండగా ఇంతకుముందు సార్స్‌‌‌‌‌‌‌‌ భయపెట్టింది. మున్ముందు ఇంకా ఏరకం వైరస్‌‌‌‌‌‌‌‌ మనుషులపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. అందుకే ఈ కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీలోని ఏ వైరస్‌‌‌‌‌‌‌‌ ద్వారా కూడా మహమ్మారులు ప్రబలకుండా యూనివర్సల్‌‌‌‌‌‌‌‌ హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ను అమెరికాలోని నార్త్‌‌‌‌‌‌‌‌ కరొలినా యూనివర్సిటీ సైంటిస్టులు డెవలప్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రస్తుత కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌పైనే కాకుండా మరిన్ని రకాల కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌లపైనా ఇది బాగా పని చేస్తోందని చెబుతున్నారు. సెకండ్‌‌‌‌‌‌‌‌ జనరేషన్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ పేరుతో జరిగిన ఈ పరిశోధనను జర్నల్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌లో పబ్లిష్‌‌‌‌‌‌‌‌ చేశారు.   

జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్‌‌‌‌‌‌‌‌లే టార్గెట్‌‌‌‌‌‌‌‌

కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీలో ప్రమాదకరంగా భావిస్తున్న జంతువుల నుంచి మనుషులకు సోకే సార్బెకొవైరసెస్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీని టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసేలా ఈ టీకాను సైంటిస్టులు రూపొందించారు. ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఏ టెక్నాలజీని ఉపయోగించి ఫైజర్‌‌‌‌‌‌‌‌, మోడర్నా టీకాల మాదిరిగా ఈ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ను రెడీ చేశారు. అయితే ఆ రెండు టీకాల్లో వాడినట్టు కేవలం ఒకే వైరస్‌‌‌‌‌‌‌‌ ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఏ కోడ్‌‌‌‌‌‌‌‌ను కాకుండా అనేక రకాల వైరస్‌‌‌‌‌‌‌‌ల కోడ్‌‌‌‌‌‌‌‌లను వాడారు. అలా చేసిన టీకాను కరోనాకు కారణమైన సార్స్-కోవ్‌‌‌‌‌‌‌‌తో పాటు, వేరే రకం కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌లు సోకిన ఎలుకలపై ప్రయోగించారు. అనేక రకాల స్పైక్‌‌‌‌‌‌‌‌ ప్రోటీన్లను అడ్డుకునేందుకు అవసరమైన యాంటీబాడీలు ఎలుకల్లో తయారయ్యాయని గుర్తించారు. ఎలుకల్లో ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గినట్లు కనుగొన్నారు. ఇటీవల దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ వేరియంట్‌‌‌‌‌‌‌‌ను కూడా ఈ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ ఈజీగా ఎదుర్కోగలదని చెప్పారు. 

మనుషులపై వచ్చే ఏడాది ప్రయోగం

యూనివర్సల్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మనుషులపై ప్రయోగాలు వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్పారు. కొత్త వేరియంట్‌‌‌‌‌‌‌‌లను అడ్డుకునే సామర్థ్యం ఈ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌కు ఉందని రీసెర్చ్‌‌‌‌‌‌‌‌కు  నేతృత్వం వహించిన వర్సిటీలోని ఎపిడమాలజిస్ట్‌‌‌‌‌‌‌‌ రాల్ప్‌‌‌‌‌‌‌‌ బారిక్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశారు. ఇలాంటి రెండో తరం టీకాలతో సార్స్‌‌‌‌‌‌‌‌-కోవ్-3ని అడ్డుకోగలమనే నమ్మకం ఉందని మరో సైంటిస్టు డేవిడ్‌‌‌‌‌‌‌‌ మార్టినెజ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.