ఈవీ కంపెనీ టెస్లా భారతదేశంలో 'మోడల్ వై ప్రీమియం రేర్-వీల్ డ్రైవ్' 2026 వేరియంట్‌ను రూ.50.89 లక్షల ధరతో లాంచ్ చేసింది. ఈ ఏడాది జులై 2026 నుంచి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ఈ బండి కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. 60 కిలోవాట్‌అవర్ బ్యాటరీ ఉన్న ఈ కారు, ఫుల్ చార్జింగ్‌పై 500 కిమీ మైలేజ్ ఇవ్వగలదు. ఇందులో 5 గురు ప్రయాణించొచ్చు. అలాగే 2,138 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది.
కేవలం రూ.6 లక్షల డౌన్‌పేమెంట్, రూ.40 వేల ఈఎంఐతో ఈ కారును కొనుక్కోవచ్చు. గత నెలలో విడుదలైన టెస్లా మోడల్ వైఎల్ (6-సీటర్) ధర రూ.61.99 లక్షలుగా ఉంది.
