
సీఎన్‌హెచ్ బ్రాండ్ న్యూ హాలండ్ ఇండియా మార్కెట్లోకి వర్క్‌మాస్టర్ 105 కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. 106 హెచ్‌పీ సామర్థ్యం గల ఈ ట్రాక్టర్, హెచ్‌వీఏసీ క్యాబిన్‌తో వస్తుంది.
దీని వల్ల వేడి, చలి నుంచి రక్షణ లభిస్తుంది. డ్రైవర్లు అన్ని కాలాల్లోనూ సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ రైతులకు అలసట లేకుండా, మెరుగైన సామర్థ్యాన్ని అందించేలా దీనిని తయారు చేశామని కంపెనీ తెలిపింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 35 లక్షలు. ట్రాక్టర్‌కు మూడేళ్లు లేదా 3,000 గంటల వారంటీ ఇస్తామని న్యూహాలండ్ ప్రకటించింది.