ఆకాశాన్ని కీర్తితో తాకుదాం: ప్రధాని మోడీ

ఆకాశాన్ని కీర్తితో తాకుదాం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాలోని అంబాలాకు చేరుకున్నాయి. రాఫెల్ ఫైటర్ జెట్స్‌ను అంబాలాకు స్వాగతిస్తూ ప్రధాని మోడీ సంస్కృతంలో ట్వీట్ చేశారు. దేశాన్ని కాపాడతాయనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. ఇదో కొత్త విజన్‌ అని మోడీ చెప్పారు.

‘దేశాన్ని కాపాడటం కంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. దేశాన్ని రక్షించడం ధర్మపరుల కార్యం. అదో యగ్నం. దీన్ని మించినది మరొకటి లేదు. ఆకాశాన్ని ఘన కీర్తితో తాకుదాం. సుస్వాగతం’ అనే అర్థం వచ్చేలా సంస్కృతంలో మోడీ ట్వీట్ చేశారు. కొత్తగా వచ్చిన ఈ ఫైటర్‌‌జెట్స్‌ను ఇండియన్ ఎయిర్‌‌ ఫోర్స్‌లో గేమ్‌ చేంజర్‌‌గా డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్‌ నుంచి దాదాపు 7 వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి రాఫెల్‌ జెట్స్‌ ఇండియాలోని అంబాలాకు చేరుకున్న విషయం విధితమే.