
- ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్స్ ప్రమోషన్లకు కొత్త రూల్స్
మందు బాగా తాగి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి మానసిక ఆరోగ్యం పాడుచేసుకుంటే టైం స్కేల్ కల్నల్స్‌గా ప్రమోషన్ ఇవ్వబోమని లెఫ్టినెంట్ కల్నల్స్‌ను ఆర్మీ హెచ్చరించింది. అంతకుముందు డ్యూటీలో ఎంత మంచి పెర్ఫార్మెన్స్ చేసినా మినహాయింపు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. అయితే, ప్రేమించిన వాళ్లను కోల్పోవడం, ఇంటి పరిస్థితుల వల్ల ఒత్తిడి పెరిగి ఆరోగ్యం పాడవడం వంటి పరిస్థితులను మాత్రం పరిగణిస్తామంది. ఇందుకు సంబంధించి రూల్స్‌ను ఆర్మీ పర్సనల్ అండ్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ గత నెలలో విడుదల చేసింది. మామూలుగా ఆర్మీ ఆఫీసర్ల మెంటల్ హెల్త్‌ను ఐదు పాయింట్ల స్కేల్ (ఎస్1 టుం ఎస్5) ద్వారా కొలుస్తారు. ఎస్1 అంటే ఫిట్, ఎస్ 5 అంటే అనర్హులు. తాజాగా మందు తాగడం, ఆ మత్తులో పిచ్చిగా ప్రవర్తించి మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్లను ఎస్2 కేటగిరీలో చేర్చింది. వాళ్లకు ప్రమోషన్లు నిలిపేస్తామని ఆర్మీ చెప్పింది. లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్ తర్వాత ఐదో పోస్టు కల్నల్. సీనియారిటీ ప్రకారం తొలి నాలుగు ప్రమోషన్లు వస్తాయి. లెఫ్టినెంట్‌గా రెండేళ్లు చేశాక కెప్టెన్, కెప్టెన్‌గా ఆరేళ్లు చేస్తే మేజర్. మేజర్‌గా 13 ఏళ్లు చేశాక లెఫ్టినెంట్ కల్నల్‌గా ప్రమోషన్ పొందుతారు. ఆ తర్వాత చాలా కష్టం. 16 నుంచి 18 ఏళ్ల సర్వీస్ తర్వాత కల్నల్స్‌గా ప్రమోషన్ పొందేందుకు లెఫ్టినెంట్ కల్నల్స్ అర్హులు. కానీ ఖాళీలు ఉండక, ఎగ్జామ్ పాసవక చాన్స్ మిస్సవుతుంటారు. వీళ్లకు 26 ఏళ్ల తర్వాత టైం స్కేల్ కల్నల్స్‌గా ప్రమోషన్ ఇస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో పని చేయాలి కాబట్టి, వారి మానసిక ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఇలాంటి కఠిన నిబంధనలు పెడుతుంది ఆర్మీ.