వాట్సాప్ ఛానెల్ను మరొకరికి బదిలీ చేయొచ్చు.. అంటే అమ్ముకోవచ్చా..!

వాట్సాప్ ఛానెల్ను మరొకరికి బదిలీ చేయొచ్చు.. అంటే అమ్ముకోవచ్చా..!

ఇన్స్టంట్ మేసేజింగ్ యాప్..వాట్సాప్ తన ఛానెల్ టూల్ కోసం కొత్త ఫీచర్ ను పరీక్షిస్తోంది. అదేంటంటే.. వాట్సాప్ చానెల్ ఓనర్ షిప్ను ఇతరులకు బదిలీ చేసేం దుకు అనుమతిచ్చే ఫీచర్. దీని ద్వారా వాట్సాప్ ఛానెల్ నియంత్రణ మొత్తం బదిలీ ఇతరులకు బదిలీ అవుతుంది.  ఈ అప్ డేట్ లు ప్రస్తుతం వాట్సాప్ బెటా వెర్షన్  వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులో వస్తుంది. 

WABetainfo  ప్రకారం.. ఆండ్రాయిడ్ కోసం లేటెస్ట్ బెటా వర్షన్ (2.24.4.22) లో ఈ ఫీచర్ ను అందుబాటులో తెస్తోంది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను యాడ్ చేయడం ద్వారా ప్రస్తుత ఓనర్ తన వాట్సాప్ ఛానల్ ఓనర్ షిప్ ను ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. కొత్త ఓనర్ దీనిని యాక్సెప్ట్ చేస్తే ఛానెల్ ను అడ్మినిస్ట్రేషన్ పరంగా సమాచారం, సెట్టింగ్ మేనేజ్ చేయడం వంటివి నిర్వహించవచ్చు. 

ఈ కొత్త ఫీచర్ తో కొత్త యజమానులు ట్రాన్స్ ఫర్ చేయబడిన వాట్సాప్ ఛానెల్ పై మరింత నియంత్రణను కలిగి ఉంటారు.అవసరమైన మార్పులు, ఛానెల్ డిలీట్ చేయడం, ఇతర నిర్వాహకులను తొలగించడం వంటి మరింత అవకాశాలను అందిస్తుంది. 

ALSO READ | కొత్త AI మోడల్ Open AI Sora.. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్..

ప్రస్తుతం కొత్త ఫీచర్ బీటా టెస్టర్ల ఎంపిక గ్రూప్ లోకి విడుదల చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు దీని యాక్సెస్ చేయనున్నారు. వినియోగదారులు Google Play  బీటా ప్రోగ్రామ్ ద్వారా యాక్సెస్ చేవవచ్చు. అయితే కొంతమంది బీటా టెస్టర్లు మునుపతి అప్ డేట్ (2.24.4.20) ని ఇన్ స్టాల్ చేసి ఉంటే ఇప్పటికే ఈ ఫీచర్ కి యాక్సెస్ పొంది ఉంటారు.