డ్రా పద్ధతిలో వైన్స్ ల కేటాయింపు

డ్రా పద్ధతిలో వైన్స్ ల కేటాయింపు

మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని 73 ఏ4 మద్యం షాపులను డ్రా పద్ధతిలో ఎస్పీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం కేటాయించామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం ఐడీఓసీలో సంబంధిత అధికారులతో కలిసి మద్యం షాపుల రిజర్వేషన్ డ్రా తీశారు. ఏజెన్సీ ప్రాంతమైన మందమర్రి మున్సిపల్ లోని 6 షాపులను డ్రా పద్ధతిలో కాకుండా ఎస్టీలకు కేటాయించారు.

ఆసిఫాబాద్​ జిల్లాలో..

ఆసిఫాబాద్​ జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 2025–27 సంవత్సరానికి గాను 4 ఎస్సీ, 1 ఎస్టీ , 2 గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం లక్కీ డ్రా ద్వారా కేటాయించినట్లు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. గురువారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్  డేవిడ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్​తో కలిసి మద్యం షాపుల డ్రా తీసే కార్యక్రమానికి హాజరయ్యారు.

 ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని 1, 4, కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలోని 1, సిర్పూర్ టి మండల కేంద్రంలోని షాపు షెడ్యూల్ కులాల వారికి, రెబ్బెన మండలం గోలేటి, బెజ్జూర్ మండల కేంద్రంలోని షాపు గౌడ కులస్తులకు, కౌటాల మండల కేంద్రంలోని 1 షాపు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించినట్లు చెప్పారు. మద్యం షాపుల కోసం దరఖాస్తులను అక్టోబర్ 18 వరకు జిల్లా ఆబ్కారీ- శాఖ కార్యాలయంలో స్వీకరిస్తామని, 23న కలెక్టరేట్ లో లాటరీ నిర్వహిస్తామని తెలిపారు.