అలర్ట్.. ఒకరోజు ముందు నుంచే డ్రంకెన్‌‌ డ్రైవ్ ‌ టెస్ట్‌‌లు

అలర్ట్.. ఒకరోజు ముందు నుంచే  డ్రంకెన్‌‌ డ్రైవ్ ‌ టెస్ట్‌‌లు

హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేసన్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే యువత న్యూ ఇయర్ మూడ్ లోకి వెళ్లింది. దీంతో ఒకరోజు ముందుగానే నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు షురూ చేశారు ట్రాఫిక్ పోలీసులు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి.. పట్టుబడినవారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇందులో దొరికితే  రూ.10 వేల వరకు ఫైన్ తోపాటు కేసు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

న్యూ ఇయర్ వేడుకల్లో యువత డ్రగ్స్ వాడే అవకాశం ఉండడంతో నార్కోటిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పబ్స్, హోటల్స్ పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో డ్రగ్స్ టెస్టులు చేసేందుకు సిటీ పోలీసులు సిద్ధం అవుతున్నారు. డ్రగ్స్ ను గుర్తించేందుకు నార్కోటిక్ బ్యూరో కొత్త పరికరాలను వాడుతోంది. ఒక్కో కమిషనరేట్ కు 25 చొప్పున డ్రగ్ డ్రాపర్ పరికరాలను అందజేశారు. ట్రై కమిషనరేట్ లో 75 డిటెక్షన్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. జంక్షన్స్, ఈవెంట్ ఏరియాలు వద్ద డిటెక్షన్ పరీక్షలకు పోలీసులు సిద్ధమయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్ పరీక్షలు చేయనున్నారు.  నోటిలో లాలజలంతో క్షణాల్లో గుర్తించనున్నారు. డ్రగ్స్ తీసుకుంటే  జైలుకు పంపిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.