ఎన్ టీఆర్ ఫ్యాన్స్ కి న్యూఇయర్ గిఫ్ట్

ఎన్ టీఆర్ ఫ్యాన్స్ కి న్యూఇయర్ గిఫ్ట్

‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్‌‌‌‌బస్టర్‌‌‌‌‌‌‌‌తో వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా ఫేమ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్.  దీంతో తారక్ నుండి రాబోయే నెక్స్ట్ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కొరటాల దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన  మూవీ రకరకాల కారణాలతో సెట్స్‌‌‌‌కి వెళ్లలేదు. ఆదివారం న్యూఇయర్ విషెస్ చెబుతూ ఫ్యాన్స్‌‌‌‌కి డబుల్ గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టేది చెప్పడంతో పాటు రిలీజ్ డేట్‌‌‌‌ను కూడా అనౌన్స్ చేయడంతో తారక్ అభిమానులకు గుడ్‌‌‌‌ న్యూస్ అనే చెప్పాలి.

ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు చెబుతూ, 2024 ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ చేయనున్నట్టు కాన్సెప్ట్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ప్రకటించారు. ఇందులో రెండు కత్తులను చూపిస్తూ ‘ధైర్యం వ్యాధిగా మారినప్పుడు.. భయమే నివారణ’ అనే కొటేషన్ రాసుండటం సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇది ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌కి 30వ సినిమా. హీరోయిన్‌‌‌‌, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.  కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. రత్నవేలు, సాబు సిరిల్, శ్రీకర ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్‌‌‌‌ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.