హ్యాపీ న్యూ ఇయర్​.. ఫస్ట్ డే ప్లానింగ్

హ్యాపీ న్యూ ఇయర్​.. ఫస్ట్ డే ప్లానింగ్

ఎవల్ని పలుకరించిన గిదే మాట. గిదే పాట. పక్కింటోళ్లు, ఎదురింటోళ్లే కాదు.. పక్కూరోళ్లు ఫోన్లో.. పరదేశపోళ్లు వాట్సాప్​లో ‘విష్​ యూ హ్యాపీ న్యూ ఇయర్​’ అని విషెస్​ చెబుతున్నరు. ‘థాంక్యూ..  సేమ్​ టూ యూ’ అని నచ్చినోళ్లు చెబుతున్నరు.

‘గీ న్యూ ఇయర్​ ఏంది?’ అనేటోళ్లు గూడ.. అరె ఏదయితే ఏందిర బై..  మనిషిని మనిషి పలుకరించుకొనుడుకి మించిన మంచేముందని  ‘సేమ్​ టూ యూ’ అంటూ సెలబ్రేట్​ చేసుకుంటున్నరు. న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ జరుపుకునేది జీవితం కొత్తగా ఉండాలని కాదు. జీవితంలో ఆనందాన్ని కొత్తగా నింపుకోవాలని..!

నిన్నటి తొవ్వలెక్కే రేపూ ఉంటది. పల్లంలో అవకాశాల్ని అందిపుచ్చుకున్నట్టే, ఎగుడు దారిలో ఏమాత్రం తడబడకుండ సాగిపోవాలంటే ప్లానింగ్​ ఉండాలె.

ఫస్ట్​ డే ఫర్​ ప్లానింగ్​..

బై బర్త్​ స్కిల్సే కాదు లెర్నింగ్​ లైఫ్​ స్కిల్స్​ని పర్ఫెక్ట్​గా వాడుకుంటేనే సక్సెస్​.  శక్తికి మించని టార్గెట్​తో శక్తివంచన లేకుండా ట్రై చేయమని చెప్పేటిదే (జనవరి) ఫస్ట్​ రెజల్యూషన్​. దాన్ని ఫాలో కావడమే కొత్త ఏడాది కర్తవ్యం. ఆ ప్లానింగ్​తో​ మీ ప్రయాణం మొదలుపెట్టమని చెప్పేదే ఈ సెలబ్రేషన్​.

హ్యాపీ లైఫ్​ కోసం ముందడుగేసే లాంగ్​ మార్చ్​కి గ్రాండ్​ లాంచింగ్​ ఈ రోజు. ఏడాదంతా తడబడకుండా ఇట్లనే సాగిపోవాలని ప్లాన్​ చేసుకోవాలని చెప్పే గట్టి హెచ్చరిక.. పటాకుల మోత. సూర్యోదయానికి ముందే వెలిగే దీపాల కాంతులు చెప్పేదొక్కటే. లైఫ్​ని ఆనందాలతో వెలిగించాలంటే మనలోని చీకటి (లోపాలు) పారదోలాలె. సూర్యోదయానికి ముందు చీకట్లను వెలిగించే దీపపు కాంతులు చెప్పేదదే. ఈ ఏడాదంతా జీవితాన్ని వెలిగిద్దాం. ఆనందాలు పండిద్దాం!  అందరికీ హ్యాపీ న్యూ ఇయర్​.