జోహ్రాన్ విక్టరీ స్పీచ్ లో నెహ్రూ ప్రస్తావన.. నెహ్రూ చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ ఎప్పటికీ మరిచిపోనని కామెంట్

 జోహ్రాన్ విక్టరీ స్పీచ్ లో నెహ్రూ ప్రస్తావన.. నెహ్రూ చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ  ఎప్పటికీ మరిచిపోనని కామెంట్

భారత దేశ తొలి ప్రధాని జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ గురించి కూడా తన విక్టరీ స్పీచ్​లో జోహ్రాన్ ప్రస్తావించారు. నెహ్రూ చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ (విధితో ప్రయాణం)’ అనే కామెంట్​ను తాను ఎప్పటికీమరిచిపోలేనని తెలిపారు. ‘‘నేను గెలిచిన వేళ నెహ్రూ చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ అనే కామెంట్ గుర్తుకొస్తున్నది. ఎన్నికల్లో నా విజయం ఓ చరిత్రాత్మక క్షణం. ఒక శకం ముగిసి.. నవ శకానికి స్వాగతం పలికే ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా మాత్రమే వస్తాయి. నా విజయం న్యూయార్క్ వాసులందరికీ అంకితం చేస్తున్నాను’’ అని జోహ్రాన్ అన్నారు. కాగా, ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్  తన కొడుకు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికైన నేపథ్యంలో తొలిసారి ‍స్పందించారు. తన కొడుకు విజయంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

నెహ్రూ  కామెంట్ ఏంటి?

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్ వేదికగా మాట్లాడారు. నాటి అమృత ఘడియలను నెహ్రూ ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’గా అభివర్ణించారు. ఆ అద్భుతం శకం రాక ముందుగానే నిర్ణయమైందని అన్నారు.