ఇండియాపై న్యూయార్క్ టైమ్స్ అసత్య ప్రచారం 

ఇండియాపై న్యూయార్క్ టైమ్స్ అసత్య ప్రచారం 

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్

న్యూఢిల్లీ : ఇండియాపై న్యూయార్క్ టైమ్స్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. కాశ్మీర్‌‌లో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ప్రచురించిన కథనం పూర్తిగా కల్పితమ ని ట్వీట్ చేశారు. ‘ఇండియా  గురించి రాసేటప్పుడు న్యూయార్క్ టైమ్స్ సంస్థ ప్రమాణాలు పాటించదు. కాశ్మీర్‌‌లో పత్రికా స్వేచ్ఛపై ఆ సంస్థ అభిప్రాయం పూర్తిగా కల్పితం. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉంది. భారత ప్రజాస్వామ్య విలువలను తప్పుగా ప్రచారం చేయడమే ఆ సంస్థ ఏకైక లక్ష్యం’ అని అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.