బంపర్ ఆఫర్.. పిజ్జా తినండి..చనిపోయాక బిల్ కట్టండి...

బంపర్ ఆఫర్.. పిజ్జా తినండి..చనిపోయాక బిల్ కట్టండి...

రెస్టారెంట్..లేదా హోటల్స్లో ఫుడ్ తింటే ..అప్పుడు బిల్ కట్టాలి. కొన్ని రెస్టారెంట్లు,  హోటళ్లలో అయితే ఫుడ్ తినడానికి ముందే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఓ హోటల్లో మాత్రం ఫుడ్ తిన్నాక కూడా బిల్ల కట్టనవసరం లేదు. అయితే పూర్తిగా ఉచితం మాత్రం...ఆ బిల్లును కస్టమర్  చనిపోయాక కట్టుకోవచ్చు.  నమ్మడం లేదా...ఇది నిజమే..

తినండి..చనిపోయాక బిల్ కట్టండి..

న్యూజిలాండ్లో హెల్  పిజ్జా అనే రెస్టారెంట్..అక్కడి కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వెల్లింగ్టన్లోని హెల్ పిజ్జా రెస్టారెంట్..ఈట్ పిజ్జా...ఆఫ్టర్ లైఫ్ పే అనే స్కీంను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కస్టమర్లు తన జీవితి కాలంలో ఎంత పిజ్జా తిన్నా..చనిపోయాక బిల్లు కట్టొచ్చని పేర్కొంది. ఇప్పటి వరకు 666 మంది కస్టమర్లు ఈ స్కీంను ఎంపిక చేసుకున్నారని హెల్ పిజ్జా వెల్లడించింది. 

నింబంధనలు వర్తించును..

తమ జీవితకాలంలో పిజ్జా తిని..చనిపోయాక బిల్ కట్టాలనుకునే కస్టమర్లు కొన్ని అగ్రిమెంట్ల మీద సంతకం చేయాల్సి ఉంటుందని హెల్ పిజ్జా సీఈవో బెన్ కమ్మింగ్ అన్నారు. ఇది చట్టబద్దంగా జరిగే ఒప్పందం అని పేర్కొన్నారు. అయితే కస్టమర్లు చనిపోయాక వారు తిన్న పిజ్జాలకు నగదు తీసుకునే సమయంలో అధికంగా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎలాంటి బిల్లులకు వడ్డీని తీసుకోబోమని స్పష్టం చేశారు. కేవలం తిన్న సమయంలో పిజ్జా ధరను మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. 

ఆఫర్ ఎందుకంటే..

న్యూజిలాండ్లో ప్రజల జీవన వ్యయం రోజుకు రోజుకు పెరిగిపోతుంది. దీని కారణంగా అక్కడి ప్రజలు ఆహారం, ఇతర అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే న్యూజిలాండ్ ప్రజలకు కనీసం పిజ్జా కొనుగోలు కోసం పెట్టే ఖర్చును మిగిలిద్దాం అని పే ఆఫ్టర్ లైఫ్ అనే స్కీంను ప్రవేశపెట్టామని హెల్ పిజ్జా సీఈవో బెన్ కమ్మింగ్ వెల్లడించారు.