సెంచరీతో ధోని రికార్డు బ్రేక్ చేసిన బ్రేస్ వెల్

సెంచరీతో ధోని రికార్డు బ్రేక్ చేసిన బ్రేస్ వెల్

ఉప్పల్ వన్డేలో అద్బుత సెంచరీ చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్మన్ మైఖెల్ బ్రేస్ వెల్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. తొలి వన్డేలో ఏడో వికెట్గా వచ్చిన 31 ఏళ్ల బ్రేస్ వెల్..78 బంతుల్లోనే 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులు సాధించాడు. దీంతో ఏడో స్థానంలో వచ్చి  తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్గా బ్రేస్ వెల్ చరిత్రకెక్కాడు. గతంలో  ఈ రికార్డు ధోని పేరిట ఉండేది.  2007 జూన్ 10న ఆఫ్రికా ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో ఆసియా ఎలెవన్ తరపున బరిలోకి దిగిన ధోని..97 బంతుల్లో 139  పరుగులు  చేశాడు. 

ఫస్ట్ వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి శతకం బాదిన బ్రేస్ వెల్...భారత్పై  రెండో వేగవంతమైన సెంచరీ చేసిన కివీస్ ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు.  బ్రేస్ వేల్ కేవలం 57 బంతుల్లో సెంచరీ సాధించాడు. గతంలో  ఈ రికార్డు న్యూజిలాండ్ తరుపున మాజీ ప్లేయర్ క్రిస్ కెయిరై పేరిట ఉండేది. అతను భారత్ పై  75 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ప్రస్తుతం ఆ రికార్డును బద్దలైంది.