రెండో టెస్ట్‌‌లో పుంజుకున్న న్యూజిలాండ్‌‌ .. 134/2

రెండో టెస్ట్‌‌లో పుంజుకున్న న్యూజిలాండ్‌‌ .. 134/2

క్రైస్ట్‌‌చర్చ్‌ ‌:  ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌‌లో న్యూజిలాండ్‌‌ పుంజుకుంది. కేన్‌‌ విలియమ్సన్‌‌ (51) తన వందో టెస్ట్‌‌లో హాఫ్‌‌ సెంచరీ సాధించడంతో పాటు టామ్‌‌ లాథమ్‌‌ (65 బ్యాటింగ్‌‌) రాణించడంతో.. శనివారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌‌కు కివీస్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 50 ఓవర్లలో 134/2 స్కోరు చేసింది. లాథమ్‌‌తో పాటు రచిన్‌‌ రవీంద్ర (11 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. విల్‌‌ యంగ్‌‌ (1) ఫెయిలయ్యాడు.  

మూడు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌లో ఓవరాల్‌‌గా కివీస్‌‌ 40 రన్స్‌‌ లీడ్‌‌లో కొనసాగుతోంది. అంతకుముందు 124/4 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌లో 68 ఓవర్లలో 256 రన్స్‌‌కు ఆలౌటైంది. లబుషేన్‌‌ (90) మెరుగ్గా ఆడినా మిగతా వారి నుంచి సహకారం దక్కలేదు. మ్యాట్‌‌ హెన్రీ (7/67) దెబ్బకు కంగారూ బ్యాటింగ్ లైనప్‌‌ పేకమేడలా కూలింది. లైయన్‌‌ (20), మార్ష్‌‌ (0), క్యారీ (14), స్టార్క్‌‌ (28), కమిన్స్‌‌ (23) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.