
హామిల్టన్: న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ కెరీర్‌లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేశాడు. సోమవారం న్యూజిలాండ్–నెదర్లాం డ్స్ మధ్య జరిగిన మూడో వన్డేతో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన ఆఖరి ఇన్నింగ్స్‌లో టేలర్ 14 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై 115 రన్స్ తేడాతో గెలిచిన కివీస్.. టేలర్‌కు సెండాఫ్ ఇచ్చింది. ప్లేయర్లంతా గ్రౌండ్లో గార్డ్ ఆఫ్ హానర్ తో రాస్‌ను గౌరవించారు.