ఉప్పల్ మ్యాచ్ : రేపట్నుంచి ప్రాక్టీస్ చేయనున్న న్యూజిలాండ్ టీం

ఉప్పల్ మ్యాచ్ : రేపట్నుంచి ప్రాక్టీస్ చేయనున్న న్యూజిలాండ్ టీం

హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం మరోసారి అంతర్జాతీయ మ్యాచ్కు వేదికగా మారింది. ఈ నెల 18న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుండడంతో ఫ్యాన్స్ ఈ మ్యాచ్ను చూసేందుకు ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్కు చేరుకుంది. తాజ్ కృష్ణ హోటల్లో బస చేస్తోంది. కివీస్ టీం రేపటినుంచి మూడు రోజుల పాటు ప్రాక్టిస్ చేయనుంది. ప్రస్తుతం శ్రీలంకతో వన్డేలు ఆడుతున్న టీమిండియా ఈ నెల 16న హైదరాబాద్కు రానుంది. రేపు శ్రీలంకతో చివరి వన్డే ఆడనుంది.  

ఈ మ్యాచ్ కు సంబంధించి నిన్నటి నుంచి ఆన్లైన్లో టికెట్లను విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారు జనవరి 15 నుండి 18 వరకు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 10 నుండి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్లను కలెక్ట్ చేసుకోవాలని హెచ్సీఏ సూచించింది. మ్యాచ్‌కి రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరిని చెప్పింది.  బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని, పార్కింగ్ ఇబ్బందులు కూడా లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది.