సెమీస్ కు అర్హత సాధించిన న్యూజిలాండ్

సెమీస్ కు అర్హత సాధించిన న్యూజిలాండ్

అడిలైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌ రన్నరప్‌‌‌‌‌‌‌‌ న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌  టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అందరికంటే ముందుగా సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌ కు దూసుకెళ్లింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) మెరుపు ఫిఫ్టీకి తోడు బౌలర్లూ సత్తా చాటడంతో శుక్రవారం జరిగిన సూపర్ 12 రౌండ్, గ్రూప్1 మ్యాచ్​లో  కివీస్‌‌‌‌‌‌‌‌35 పరుగుల తేడాతో ఐర్లాండ్ ను ఓడించింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన కివీస్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.  విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ కు తోడు ఓపెనర్లు ఫిన్ అలెన్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 32), డెవాన్ కాన్వే (28) , డారిల్ మిచెల్ (31 నాటౌట్) రాణించారు.

ఐర్లాండ్ బౌలర్లలో  జోష్ లిటిల్ (3/22) హ్యాట్రిక్ సహా మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఐరిష్ టీమ్‌‌‌‌‌‌‌‌ ఓవర్లన్నీ ఆడి 150/9 స్కోరు మాత్రమే చేసింది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (37), ఆండీ బల్బర్నీ (30) రాణించినా మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ (3/22) మూడు వికెట్లతో దెబ్బకొట్టాడు.  కేన్ విలియమ్సన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గ్రూప్​1లో ఐదు  మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో మూడు విజయాలు, ఓ ఓటమి, మరో ఫలితం తేలని మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో కివీస్‌‌‌‌‌‌‌‌ 7 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌లో నిలవగా.. ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ ఒక గెలుపు, మూడు ఓటములు, 3 పాయింట్లతో ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో టోర్నీ నుంచి వైదొలిగింది.

కేన్‌‌‌‌‌‌‌‌ ధనాధన్‌‌‌‌‌‌‌‌.. జోష్​ హ్యాట్రిక్

​సెమీస్‌‌‌‌‌‌‌‌ బెర్తు ఊరిస్తుండగా చిన్న జట్టుపై కివీస్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు రెచ్చిపోయారు. కాన్వే స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేయగా.. మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ ఫిన్‌‌‌‌‌‌‌‌ బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 35 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 52 రన్స్‌‌‌‌‌‌‌‌  జోడించాడు. ఆరో ఓవర్లో ఫిన్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన అడైర్‌‌‌‌‌‌‌‌ ఈ జోడీని విడదీసినా ఫలితం లేకపోయింది. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కేన్‌‌‌‌‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించాడు. ఐరిష్‌‌‌‌‌‌‌‌ బౌలర్లపై భారీ షాట్లతో చెలరేగాడు. దాంతో 12 ఓవర్లోనే కివీస్‌‌‌‌‌‌‌‌ స్కోరు వంద దాటింది. డెలానీ తన వరుస ఓవర్లో కాన్వే, ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (17)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసినా కేన్‌‌‌‌‌‌‌‌ వెనక్కు తగ్గలేదు. మిడిల్‌‌‌‌‌‌‌‌ ఓవర్లలోనూ అదే జోరు కొనసాగించాడు. డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌తో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. ఈ క్రమంలో 32 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కేన్​ ఊపు చూస్తుంటే కివీస్‌‌‌‌‌‌‌‌ ఈజీగా 200 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, చివర్లో ఐరిష్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌ లిటిల్‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 19వ ఓవర్లో వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో విలియమ్సన్‌‌‌‌‌‌‌‌, జేమ్స్‌‌‌‌‌‌‌‌ నీషమ్‌‌‌‌‌‌‌‌ (0), శాంట్నర్‌‌‌‌‌‌‌‌ (0)లను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ సాధించి మూడే రన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో అడైర్‌‌‌‌‌‌‌‌ 9 రన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఇవ్వడంతో కివీస్‌‌‌‌‌‌‌‌ అనుకున్నదానికంటే కాస్త తక్కువ స్కోరు చేసింది.

బౌలర్ల జోరు

భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌ను ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ ధాటిగానే మొదలు పెట్టింది. ఓపెనర్లు స్టిర్లింగ్‌‌‌‌‌‌‌‌, బల్బర్నీ తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 68 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. తొమ్మిదో ఓవర్లో స్టిర్లింగ్‌‌‌‌‌‌‌‌ను సోధీ, తర్వాత బల్బర్నీని శాంట్నర్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత  కూడా కివీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఐరిష్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెంచారు. హ్యారీ టెక్టర్‌‌‌‌‌‌‌‌ (2), డెలానీ (10), టకర్‌‌‌‌‌‌‌‌ (13) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. డాక్‌‌‌‌‌‌‌‌ రెల్‌‌‌‌‌‌‌‌ (23) మధ్యలో పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ, మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో అతనికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌ దక్కలేదు. కివీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్ల దెబ్బకు క్యాంఫర్‌‌‌‌‌‌‌‌ (7), ఫియోన్‌‌‌‌‌‌‌‌ (5), అడైర్‌‌‌‌‌‌‌‌ (4) కూడా సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్స్‌‌‌‌‌‌‌‌కే వెనుదిరిగారు. దాంతో, ఓవర్లన్నీ ఆడినప్పటికీ ఐరిష్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఓటమి తప్పలేదు.

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌: 20 ఓవర్లలో 185/6 (విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ 61, జోష్‌‌‌‌‌‌‌‌ లిటిల్‌‌‌‌‌‌‌‌ 3/22)
ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌: 20 ఓవర్లలో 150/9 (స్టిర్లింగ్‌‌‌‌‌‌‌‌ 37, బల్బర్నీ 30, ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ 3/22).