టీమిండియా ఫ్లాప్ షో…కివీస్ గ్రాండ్ విక్టరీ

టీమిండియా ఫ్లాప్ షో…కివీస్ గ్రాండ్ విక్టరీ

భారత్ తో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 144/4 వికెట్లతో నాల్గో రోజు ఆట మొదలు పెట్టిన టీమిండియా 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ ముందు కేవలం 9 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంచింది. 1.4 ఓవర్లలోనే టార్గెట్ చేధించి ఒకరోజు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కోహ్లీ విఫలం..

కోహ్లీ చెత్త ఫామ్ కొనసాగుతూనే ఉంది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 2 పరుగులకే ఔటయినా  రెండో ఇన్నింగ్స్ లోనూ (19) మరోసారి నిరాశపర్చాడు. చకచకా మూడు బౌండరీలు బాదడంతో ఫామ్‌ లోకి వచ్చాడనుకున్నా.. బౌల్ట్‌ స్వింగ్‌ ఉచ్చుకు దొరికిపోయాడు. 46వ ఓవర్‌ లో బౌల్ట్‌ ఊరించే షార్ట్​ బాల్ వేయగా కోహ్లీ పుల్​​ షాట్​ ఆడబోయి కీపర్​ చేతికి చిక్కాడు. 113/4 స్కోరు వద్ద రహానెకు తోడైన విహారి.. డిఫెన్స్‌ కే ప్రాధాన్యం ఇచ్చారు. అసలైన టెస్ట్‌ మజానురుచి చూపిస్తూ వీలైనన్ని ఎక్కువ బాల్స్‌
ఆడటమే లక్ష్యంగా బ్యాటింగ్‌ చేశారు. 19ఓవర్ల పాటు వికెట్‌ ను కాపాడుకొని ఐదో వికెట్‌ కు 31 రన్స్‌ జత చేసి మూడో రోజును ముగించిన టీమిండియా నాల్గోరోజు 191 రన్స్ కే ఆలౌట్ అయ్యింది.

భారత్ తొలి ఇన్నింగ్స్ -165 ఆలౌట్

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ -348 ఆలౌట్

భారత్ సెకండ్ ఇన్నింగ్స్ – 191 ఆలౌట్

న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ – 9/0(1.4 ఓవర్లు)