పాక్పై రెండో టీ20లోనూ న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ గెలుపు

పాక్పై రెండో టీ20లోనూ న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ గెలుపు

హామిల్టన్‌‌‌‌‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఫిన్‌‌‌‌‌‌‌‌ అలెన్‌‌‌‌‌‌‌‌ (41 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 74), బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఆడమ్‌‌‌‌‌‌‌‌ మిల్నె (4/33) చెలరేగడంతో.. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ 21 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌ 2–0 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన కివీస్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 194/8 స్కోరు చేసింది.

విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (26), మిచెల్‌‌‌‌‌‌‌‌ సాంట్నెర్‌‌‌‌‌‌‌‌ (25), డేవన్‌‌‌‌‌‌‌‌ కాన్వే (20) ఫర్వాలేదనిపించారు. పాక్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో హారిస్‌‌‌‌‌‌‌‌ రవూఫ్‌‌‌‌‌‌‌‌ 3, అబ్బాస్‌‌‌‌‌‌‌‌ ఆఫ్రిది 2 వికెట్లు తీశారు. తర్వాత పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ 19.3 ఓవర్లలో 173 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. బాబర్‌‌‌‌‌‌‌‌ ఆజమ్‌‌‌‌‌‌‌‌ (66), ఫకర్‌‌‌‌‌‌‌‌ జమాన్‌‌‌‌‌‌‌‌ (50), షాహీన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్రిది (22) రాణించినా మిగతా వారు ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో ఎనిమిది మంది సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు.