తెలంగాణలో కొత్తగా 661 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 661 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 661 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,57,374 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి ముగ్గురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,404కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,637 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,40,545గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,425 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 12,899 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శనివారం 21,264 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 48,74,433 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 93.46 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 167, మేడ్చల్ 45, రంగారెడ్డి 57, నల్గొండ 34 కేసులు నమోదైనట్లు రోగ్యశాఖ తెలిపింది.

For More News..

పండగపూట షోరూం దోచుకెళ్లిన దొంగలు

కరోనా నుంచి కోలుకున్నా వదలని మృత్యువు.. తణుకు మాజీ ఎమ్మెల్యే మృతి

13 ఏళ్ల బ్యాన్ తర్వాత అందుబాటులోకి గర్భనిరోధక మాత్రలు