కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పార్లమెంట్ లో ఎంపీ వంశీ కృష్ణ

కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పార్లమెంట్ లో ఎంపీ వంశీ కృష్ణ

కొత్తగా ఎన్నికైన ఎంపీలతో పార్లమెంట్ కళకళలాడుతోంది. లోక్ సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం కోసం.. 2024, జూన్ 24వ తేదీ పార్లమెంట్ సమావేశం అయ్యింది. సభలో కొత్త ఎంపీల పరిచయాలతో ఆహ్లాదంగా మారింది.  ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు సందడి చేశారు. 

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీతో పాటు నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, రాజ్యసభ  సభ్యులు అనిల్ యాదవ్ పార్లమెంట్ ఎదుట కలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు.