నవదంపతుల ప్రాణం తీసిన సెల్ఫీ

నవదంపతుల ప్రాణం తీసిన సెల్ఫీ

యశ్వంత్‌పూర్: ఈ మధ్యే పెళ్లయిన దంపతులు సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయారు. ఈ విషాద ఘటన కర్నాటక హసన్ జిల్లాలోని హేమావతి నది వద్ద జరిగింది. మృతులను అర్థేశ్ (27), కృతిక (23) గా గుర్తించారు. వీరికి రెండు నెలల కిందటే పెళ్లయింది. బెంటళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న అర్థేశ్ రెండు రోజుల కిందట భార్యతో పాటు మురహాలిలోని తన అత్తమామల ఇంటికి వెళ్లాడు. గురువారం సాయంత్రం దంపతులిద్దరూ కలిసి బైక్ మీద హేమావతి నదికి వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాకపోయేసరికి గాలించగా.. నదీతీరంలో వాళ్ల బైక్ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. నదిలో గాలించగా అర్థేశ్ , కృతిక డెడ్ బాడీలు బయటపడ్డాయి. ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబానికి అప్పగించారు. చెక్ డ్యాం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఈ జంట ప్రమాదవశాత్తు నదిలోకి జారిపడిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.