ప్రేమ పెండ్లి.. 4 నెలలకే ఆత్మహత్య .. హైదరాబాద్‌‌లో కొత్త దంపతుల ఆత్మహత్య

ప్రేమ పెండ్లి.. 4 నెలలకే ఆత్మహత్య .. హైదరాబాద్‌‌లో కొత్త దంపతుల ఆత్మహత్య

అంబర్‌‌‌‌పేట, వెలుగు:  ప్రేమించి పెండ్లి చేసుకున్న నవ దంపతులు.. 4 నెలలకే ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఇద్దరి మధ్య గొడవల కారణంగా ఉరేసుకుని తనువు చాలించారు. ఈ ఘటన హైదరాబాద్‌‌లోని అంబర్‌‌‌‌పేటలో జరిగింది. రాజస్థాన్‌‌కు చెందిన పవన్ కుమావత్ (21), ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఆసియా అసిమ్ ఖాన్ (29) కొంతకాలంగా హైదరాబాద్‌‌లో ఉంటున్నారు. వీళ్లు నాలుగైదు నెలల కిందనే ప్రేమ వివాహం చేసుకున్నారు. అంబర్‌‌‌‌పేట పరిధి గోల్నాకలోని లక్ష్మీనగర్‌‌‌‌లో అద్దెకు ఉంటూ డైలీ లేబర్‌‌‌‌గా పని చేస్తున్నారు. 

అయితే గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో పాటు వారి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ మంగళవారం సాయంత్రం తమ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రూమ్ డోర్ తీయకపోవడంతో ఇంటి ఓనర్‌‌‌‌కు అనుమానం వచ్చి బుధవారం కిటికీలో నుంచి చూడగా ఉరేసుకుని కనిపించారు. అంబర్‌‌‌‌పేట్ పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.