మోడీ మరింత బలమైన నేతగా మారుతున్నారు

మోడీ మరింత బలమైన నేతగా మారుతున్నారు
  • కరోనా సంక్షోభంలో ఆయన ప్రాభవం మస్తు పెరిగింది
  • ప్రధాని మోడీని ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం

న్యూయార్క్ : కరోనా సంక్షోభాన్ని ప్రధాని మోడీ ఎదుర్కొంటోన్న తీరును న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రశంసించింది. కరోనా నివారణ చర్యల విషయంలో ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారని తెలిపింది. ప్రధాని మోడీని ఓ మొబిలైజర్ గా వర్ణించింది. న్యూయార్క్ టైమ్స్ కరోనా టైమ్ లో మోడీ ప్రాభవం మరింత పెరిగిందంటూ కథనాన్ని ప్రచురించింది. దాదాపు 90 శాతం మంది మోడీ నిర్ణయాలకు మద్దతుగా ఉంటారని కథనంలో పేర్కొంది. అందుకు ఉదాహరణగా జనతా కర్ఫ్యూ, కరోనా వారియర్స్ ను చప్పట్లు కొడుతూ అభినందించటం, దీపాలు వెలిగించటం వంటి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు ప్రజలకు స్పందించిన తీరును వివరించింది. మొదటి లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి ప్రధాని తీసుకుంటున్న చర్యలను ఆయన పనితీరును కథనంలో ప్రశంసిస్తూ రాసింది. ఐడియాలజీతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యక్తుల అభిప్రాయాలను తీసుకొని కరోనా నివారణకు కృషి చేస్తున్నారని అదే విధంగా ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఇప్పటికే మూడుసార్లు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారని తెలిపింది. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల కన్నా మోడీకి అమోఘమైన ప్రజాదరణ దక్కుతోందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో రాయటం విశేషం. కరోనా సంక్షోభంలో మోడీ వ్యవహారిస్తున్న తీరు ఆయన ప్రాభవాన్ని పెంచుతోందని…2019 లో మోడీ తిరిగి ఎన్నికయ్యాక పుల్వామా దాడి ఘటన ఆయన్ను బలమైన నేతగా నిలిపితే, తాజా కరోనా సంక్షోభం మరింత దృఢమైన నాయకుడిగా ఆవిష్కరించిందని న్యూయార్క్ టైమ్ పేర్కొంది. అదే విధంగా మైగ్రెంట్ వర్కర్స్ పడుతున్న ఇబ్బందులను కూడా న్యూయార్క్ టైమ్స్ ప్రస్తావించింది. వారికి సరైన వసతులు కల్పించకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారంటూ యూపీలోని ఔరియాలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ మెన్షన్ చేసింది. ఐతే ఇండియాలో నమోదవుతున్న కేసులు, డెత్ రేట్ ఇక్కడి జనాభాతో పోల్చుకుంటే చాలా తక్కువంటూ న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించింది.