న్యూజిలాండ్ 162 ఆలౌట్..ఆస్ట్రేలియాతో రెండో టెస్టు

న్యూజిలాండ్ 162 ఆలౌట్..ఆస్ట్రేలియాతో రెండో టెస్టు

క్రైస్ట్‌‌చర్చ్: తొలి టెస్టులో న్యూజిలాండ్‌‌పై ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా రెండో మ్యాచ్‌‌నూ మెరుగ్గా ప్రారంభించింది. జోష్ హేజిల్‌‌వుడ్‌‌ (5/31) ఐదు వికెట్లతో చెలరేగడంతో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో కివీస్ తొలి ఇన్నింగ్స్‌‌లో 162 రన్స్‌‌కే కుప్పకూలింది. లామ్ లాథమ్ (38) టాప్ స్కోరర్. లాథమ్, స్టార్క్ (3/59) దెబ్బకు హోమ్‌‌టీమ్ బ్యాటర్లు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. 

బ్లండెల్ (22), చివర్లో మాట్ హెన్రీ (29), కెప్టెన్ టిమ్ సౌథీ (26) పోరాటంతో కివీస్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌‌కు వచ్చిన ఆసీస్ తొలి రోజు చివరకు 124/4 స్కోరు చేసింది. ఓపెనర్లు స్మిత్ (11), ఖవాజా (16), గ్రీన్ (25), హెడ్ (21) ఔటవగా..  లబుషేన్ (45 బ్యాటింగ్‌‌), లైయన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హెన్రీ 3 వికెట్లు పడగొట్టాడు.