ఈ 100 రోజులు చాలా కీలకం..కార్యకర్త ప్రతీ కొత్త ఓటరును కలవాలి: మోదీ

ఈ 100 రోజులు చాలా కీలకం..కార్యకర్త ప్రతీ కొత్త ఓటరును కలవాలి: మోదీ

రానున్న 100 రోజులు తమకు చాలా కీలకమన్నారు ప్రధాని మోదీ. బీజేపీ  కార్యకర్తలు ఇంకా కష్టపడి పనిచేయాలని సూచించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడిన మోదీ.. బీజేపీ కార్యకర్తలు 24 గంటలు దేశం కోసం కష్టపడుతున్నారని చెప్పారు. 18ఏళ్లు నిండినవాళ్లు 18వ లోక్ సభకు ఓటు వెయ్యబోతున్నారని చెప్పారు.  అన్ని వర్గాల వారికి బీజేపీ కార్యకర్తలు చేరువ కావాలన్నారు.  కార్యకర్తల కష్టానికి తప్పకుండా ఫలితం  దక్కుతుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలకు అధికార గర్వం లేదన్నారు.  ప్రజల సంక్షేమం దేశం కోసం పాటు పడుతున్నారని తెలిపారు. తనను విశ్రాంతి తీసుకొమ్మని కొంత మంది సూచిస్తున్నారు.. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు..దేశం ముఖ్యమన్నారు. శివాజీ నాకు స్ఫూర్తి అందుకే  24 గంటలు  దేశం గురించే ఆలోచిస్తానని మోదీ చెప్పారు. తనకు వ్యక్తిగత ప్రతిష్ట, అధికారం,  కుటుంబం కూడా ముఖ్యం కాదన్నారు. దేశ ప్రజలే తన  కుటుంబం అని తెలిపారు. 

వికసిత్ భారత్ కోసం ప్రజలంతా కృషి చేస్తున్నారని తెలిపారు మోదీ. ప్రజల స్వప్నాలు తప్పకుండా సాకారమవుతున్నాయన్నారు.  రానున్న ఐదేళ్లు మనకు చాలా కీలకం. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దడానికి కష్టపడతామన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలంటే దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలని  చెప్పారు.

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు మోదీ. ఈ సారి అధికారంలోకి వచ్చాక భారత్ ను మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.  2029లో భారత్ లో యూత్ ఓలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం భారత్ కు లేదన్నారు.  సెమీ కండక్టర్ హబ్ గా భారత్  మారుతుందన్నారు. రామాయణంతో ముడిపడి ఉన్న క్షేత్రాలను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాని మోదీ అన్నారు. దక్షిణ భారత ప్రజలు నన్ను ఎంతో ప్రేమిస్తారన్నారు. కంభ రామాయణం విని ఎంతో పులికించిపోయానని తెలిపారు. 

ALSO READ | మళ్లీ మనదే అధికారం.. ఎన్డీయేకు 400లకు పైగా సీట్లు వస్తయ్: మోదీ