మళ్లీ మనదే అధికారం.. ఎన్డీయేకు 400లకు పైగా సీట్లు వస్తయ్: మోదీ

మళ్లీ మనదే అధికారం.. ఎన్డీయేకు 400లకు పైగా సీట్లు వస్తయ్: మోదీ

ఎన్డీయేకు 400కు పైగా సీట్లు  వస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. బీజేపీకి 370 సీట్లు ఖాయమన్నారు.  పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు.  అధ్బుతమైన విజయాలు అందుకున్నాం. వికసిత్ భఆరత్ కోసం ప్రజలంతా కృషి  చేస్తున్నారని చెప్పారు.  ఉగ్రవాదం, అవినీతి నుంచి దేశానికి ముక్తి కల్పించామన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలు బాగుచేశామన్నారు.

 తనను విశ్రాంతి తీసుకొమ్మని కొంత మంది సూచిస్తున్నారు.. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు..దేశం ముఖ్యమన్నారు మోదీ. శివాజీ నాకు స్ఫూర్తి అందుకే  24 గంటలు  దేశం గురించే ఆలోచిస్తానని మోదీ చెప్పారు. తనకు వ్యక్తిగత ప్రతిష్ట, అధికారం,  కుటుంబం కూడా ముఖ్యం కాదన్నారు. దేశ ప్రజలే తన  కుటుంబం అని తెలిపారు.  బీజేపీ కార్యకర్తలు 24 గంటలు దేశం కోసం కష్టపడుతున్నారన్నారు మోదీ.  రానున్న వంద రోజులు తమకు చాలా కీలకమన్నారు.   కార్యకర్తలు ఇంకా కష్టపడి పనిచేయాలని సూచించారు. 

18ఏళ్లు నిండినవాళ్లు 18వ లోక్ సభకు ఓటు వెయ్యబోతున్నారని చెప్పారు మోదీ.  అన్ని వర్గాల వారికి బీజేపీ కార్యకర్తలు చేరువ కావాలన్నారు.  కార్యకర్తల కష్టానికి తప్పకుండా ఫలితం  దక్కుతుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలకు అధికార గర్వం లేదన్నారు.  ప్రజల సంక్షేమం దేశం కోసం పాటు పడుతున్నారని తెలిపారు. జైనముని విద్యాసాగర్ మృతిపై భావోద్వేగానికి  గురయ్యారు మోదీ . 50 ఏళ్లుగా ఆయనతో తనకు అనుభందం ఉందన్నారు. ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకోలేకపోయానని చెప్పారు. దిగంబర మునిగా పేదలకు ఎంతో సేవ చేశారన్నారు.

 వికసిత్ భారత్ కోసం ప్రజలంతా కృషి చేస్తున్నారని తెలిపారు మోదీ. ప్రజల స్వప్నాలు తప్పకుండా సాకారమవుతున్నాయన్నారు.  రానున్న ఐదేళ్లు మనకు చాలా కీలకం. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దడానికి కష్టపడతామన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలంటే దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలని  చెప్పారు.

  • ALSO READ | ఇండియా కూటమిని కౌరవులతో పోల్చిన అమిత్ షా

సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తామన్నారు ప్రధాని మోదీ.  ఆదివాసీలు,విశ్వకర్మల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చామన్నారు.  మహిళలపై  అత్యాచారాలు చేస్తే ఉరిశిక్షలు వేస్తున్నామన్నారు. రేప్ కేసులను  ఫాస్ట్ ట్రాక్ కోర్టులు విచారిస్తున్నామని చెప్పారు.  భేటీ పడావ్, భేటీ బచావ్ నినాదానికి ప్రజలు మద్ధతు ఇచ్చారన్నారు. ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయోధ్యలో రామమందిరం పూర్తి చేసి ఐదు దశాబ్దాల కల నెరవేర్చాం..ఆర్టికల్ 370ని రద్దు చేశాం.  రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా మార్చాం, మహిళా రిజర్వేషన్లు కల్పించాం ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశాం,  కొత్త పార్లమెంట్ ను నిర్మించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం,  తామిచ్చే హామీలు ప్రతిపక్ష నేతల మాటల్లో ఎప్పుడూ  విని ఉండరని చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నామని తెలిపారు.

 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు మోదీ. ఈ సారి అధికారంలోకి వచ్చాక భారత్ ను మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.  2029లో భారత్ లో యూత్ ఓలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం భారత్ కు లేదన్నారు.  సెమీ కండక్టర్ హబ్ గా భారత్  మారుతుందన్నారు. రామాయణంతో ముడిపడి ఉన్న క్షేత్రాలను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాని మోదీ అన్నారు. దక్షిణ భారత ప్రజలు నన్ను ఎంతో ప్రేమిస్తారన్నారు. కంభ రామాయణం విని ఎంతో పులికించిపోయానని తెలిపారు. 

దేశ సరిహద్దులను పటిష్టం చేశామన్నారు మోదీ. సరిహద్దు ఆఖరి గ్రామాలు ఇపుడు దేశానికి మొదటి గ్రామాలని చెప్పారు. దేశంలో తటస్థులు కూడా బీజేపీకి మద్ధతు ఇస్తున్నారు, విమర్శించే వాళ్లు కూడా చాటుగా ప్రశంసిస్తున్నారు.కుటుంబ పాలనను ధ్వంసం చేశాం..కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చామన్నారు. పశ్చిమ ఆసియా దేశాలతో సంబంధాలు మెరుగయ్యాయి. 5 అరబ్ దేశాలు నాకు అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చాయి. ఇది భాతర్ ప్రజలందరికీ గర్వకారణమన్నారు మోదీ.

దేశానికి కాంగ్రెస్ అతిపెద్ద ముప్పు అని అన్నారు మోదీ. ఈ ముప్పు నుంచి దేశ ప్రజలు బయటపడాలన్నారు.  కాంగ్రెస్ అంటే అస్థిరత, కుటుంబ పాలన అవినీతికి మారుపేరన్నారు. ఇపుడు కూడా అస్థిరత సృష్టించడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే విభజన రాజకీయం.  సైన్యాన్ని కూడా కాంగ్రెస్ అవమానించిందన్నారు.  రాఫెల్ కుంభకోణమని తప్పుడు ప్రచారం చేశారు. HAL ను అమ్ముతున్నట్లు పుకార్లు పుట్టించారు. హాల్ ఇపుడు లాభాల్లో నడుస్తోంది. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తే కాంగ్రెస్ నమ్మలేదన్నారు.  కాంగ్రెస్ లో ఇపుడు అంతర్మథనం  నడుస్తోందన్నారు. ఓ వర్గం మోదీని తిట్టడేమ పనిగా పెట్టుకుంది. మరో వర్గం మోదీని విమర్శించడం మానుకోవాలని సూచిస్తోందన్నారు. మోదీ