కరోనా అలర్ట్ : రానున్న 40 రోజులు భారత్‌కు కీలకం

కరోనా అలర్ట్ : రానున్న 40 రోజులు భారత్‌కు కీలకం

కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో  కొవిడ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. మహమ్మరి కట్టడికి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మరిన్ని కీలక సూచనలతో పాటు, హెచ్చరికలనూ జారీ చేసింది. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్లు వాడాలని చెప్పింది. రానున్న 40 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని కేంద్రం సూచించింది. చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లోనూ కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది.

గత రెండు రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో కలిపి మొత్తం 6వేల మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు చేయగా.. అందులో 39మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే దేశంలో గత 24 గంటల్లో 188 కొత్త కొవిడ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం రికవరీ రేటు 98.8శాతంగా ఉంది.