పేదలకు సాయం చేస్తున్న‌ ఎన్జీఓలకు ఈజీగా ఫుడ్ గ్రెయిన్స్

పేదలకు సాయం చేస్తున్న‌ ఎన్జీఓలకు ఈజీగా ఫుడ్ గ్రెయిన్స్
  • ఓపెన్​ మార్కెట్​ సేల్​ స్కీమ్​ ద్వారా పంపిణీ

న్యూఢిల్లీ: కరోనా కష్ట కాలంలో పేదలకు ఆహారం అందజేయడంలో ఎన్జీఓలు, చారిటబుల్ ట్రస్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్​ మినిస్ట్రీ తెలిపింది. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకుంటున్నాయని అభినందించింది. ఈ నేపథ్యంలో ఎన్జీఓలు, చారిటబుల్ ట్రస్టులకు ఫుడ్ గ్రెయిన్స్ పంపిణీలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా నిర్ణయం తీసుకుంది. వీటికి ఈ–అక్షన్ ద్వారా కాకుండా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద ఫుడ్ గ్రెయిన్స్ అందజేయాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా (ఎఫ్ సీఐ)ను ఆదేశించింది. ఎఫ్​సీఐ స్టేట్ గవర్నమెంట్స్, రిజిస్టర్డ్ యూజర్లకు మాత్రమే ఓఎంఎస్ఎస్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ పంపిణీ చేస్తుంది. అయితే కరోనా ఎమర్జెన్సీ టైమ్ లో ఎన్జీఓలు, చారిటబుల్ ట్రస్టులు గొప్పగా పని చేస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫుడ్ మినిస్ట్రీ తెలిపింది.