సంగమేశ్వరం పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ విచారణ

సంగమేశ్వరం పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ విచారణ
  • అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టేందుకు వీలులేదన్న ఎన్జీటీ బెంచ్

చెన్నై: కృష్ణా నదిపై.. శ్రీశైలం డ్యాంకు ఎగువన..  ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంగమేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. ఎన్ జి టి తీర్పును ధిక్కరించి నిర్మాణం పనులు సాగిస్తున్నారని గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ఉల్లంఘన కేసు దాఖలు చేయడంతో విచారణ జరిగింది. అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి వీలు లేదని జస్టిస్ రామకృష్ణన్, సైబల్ దాస్ గుప్త నేతృత్వంలోని ఎన్ జి టి చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  గతంలో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్ జి టి తీర్పుపై ఏమైనా అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టులో సవాలు చేయాల్సింది పోయి కేంద్ర పర్యావరణ శాఖకు అనుమతులు అవసరం లేదని లేఖ రాశారని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్  తెలిపారు.

ఎన్ జి టి ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఎపి ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది

బెంచ్ విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ జి టి ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఎపి ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని చెప్పారు. తాము దాఖలు చేసిన కోర్టు ఉల్లంఘన కేసుపై నాలుగోసారి ఏఫీ ప్రభుత్వం వాయిదా కోరుతోందని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. పిటిషనర్ వాదనతో తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు ఏకీభవించారు. ఎన్ జి టి తీర్పు ను ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తోందని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ క్రిష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు గత ఏడాది డిసెంబర్ లో ఫిర్యాదు చేశారని వివరించారు. గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసుతో పాటు తెలంగాణ ప్రభుత్వ సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖపై వివరణ ఇవ్వాలని క్రిష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డును బెంచ్ ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనె 24వ తేదీకి వాయిదా వేసింది.

For More News..

హుండీలు నిండాయని కానుకలు తీసుకోని ఆలయ సిబ్బంది

మంత్రి కొడుకు జీతం కోసం నన్ను బలిచేశారు.. మహబూబాబాద్ సర్కారు డాక్టర్ కన్నీళ్లు

డిప్రెషన్‌లో చాలా రకాలున్నయ్​.. లైఫ్ స్టైల్, మనస్తత్వాన్ని బట్టి లక్షణాలు

లోడ్ చార్జీల పేర ట్రాన్స్‌కో వడ్డింపులు