‘కాళేశ్వరం’ పెంపుపై వివరణ ఇవ్వండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం

‘కాళేశ్వరం’ పెంపుపై  వివరణ ఇవ్వండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం

    రెండు వారాలు గడువు కోరిన సర్కారు

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. వెంటనే నివేదికలంటే సిద్ధంగా లేవని, వివరణకు రెండు వారాల గడువు ఇవ్వాలని రాష్ట్ర సర్కారు తరపు లాయర్ కోరారు. ఎన్జీటీ పేర్కొన్న టైంలోపే నివేదిక సమర్పిస్తామన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు కడుతున్నారని హయాతుద్దీన్ అనే వ్యక్తి  ఎన్జీటీని ఆశ్రయించారు. కేసు విచారణ టైంలో ప్రాజెక్టు అనుమతులొచ్చినా ఇవ్వడంలో పర్యావరణ శాఖ నిబంధనలు పాటించలేదని హయాతుద్దీన్ మధ్యంతర పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం ఎన్జీటీ విచారణ జరిపింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సామర్థ్యాన్ని  ప్రభుత్వం పెంచిందని, దీనిపై అనుమతుల్లో సవరణలు చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పిటిషనర్​ తరఫు లాయర్​ వాదించారు. విచారణ 13కు వాయిదా పడింది.