ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్(AI) ఇలా కూడా ఉపయోగపడుతుందా..? ఇందులో ఉంది.. అందులో లేదు అనే సందేహం లేకుండా AI టెక్నాలజీ అన్ని రంగాల్లో చొరబడింది.. ఇప్పటికే ఐటీ రంగంలో సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్..టెకీలకు ఉద్యోగాలకు ఎసరు పెట్టింది..అది అలా ఉంటే ఇప్పుడు రోడ్లు సర్వేలు చేసి రిపేర్చేసేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారట..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల సంస్థ (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల మరమ్మత్తుకు సిద్దమవుతోంది.. మొత్తం 23 రాష్ట్రాలలో 20 వేల కిలోమీటర్ల మేర హైవేల మరమ్మత్తులు చేపట్టనుంది. అయితే హైవేలపై ఎక్కడ రిపేర్లు ఉన్నాయి.. ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి.. తెలుసుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఉపయోగించాలని నిర్ణయించింది..
లేటెస్ట్ సెన్సార్లు, డేటా సేకరణ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తోంది NHAI. జాతీయ రహదారులపై పగుళ్లు, గుంతలు గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఈ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తోంది. NHAI ప్రయత్నం దేశంలోని రహదారుల నెట్ వర్క్, ప్రయాణికుల రైడింగ్ భద్రతను మెరుగుపరుస్తుందని చెబుతోంది.
రోడ్ల జాబితా, డేటా సేకరణ, హైవేల పరిస్థితని అంచనా వేయడంతో పాటు మౌలిక సదుపాయాల ప్రణాళిక, నిర్వహణ ఆధారంగా నిర్ణయం తీసుకునే విధంగా ఏఐ సాయపడుతుందని NHAI అధికారిక ప్రకటనలో తెలిపింది.
హైవే రక్షణకు లేటెస్ట్ టెక్నాలజీ..
గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ (GPS), త్వరణం ,కోణీయ వేగాన్ని పర్యవేక్షించే ఎలక్ట్రానిక్ సెన్సార్లు ,3D లేజర్ ఏఐ ఆధారిత సిస్టమ్స్ ను వాహనాల్లో అమర్చి అంచనా వేస్తారు. వెంటనే మరమ్మతు చేయాల్సి పరిస్థితులను ఖచ్చితంగా గుర్తించడంతో , రికార్డు చేయడంతో ఈ టెక్నాలజీస్ సాయపడతాయని NHAI తెలిపింది.
