రైతు నిరసనలపై కేంద్రానికి హెచ్‌ఆర్సీ నోటీసులు

రైతు నిరసనలపై కేంద్రానికి హెచ్‌ఆర్సీ నోటీసులు

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు సంబంధించి ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులిచ్చింది. ఎడతెగని రైతుల ఆందోళనపై తమకు అనేక కంప్లైంట్స్ వచ్చాయని తెలిపింది.

రైతుల ఆందోళనతో 9 వేలకు పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రభావం పడిందని తమకు తెలిసింది ఎన్‌హెచ్‌ఆర్సీ వివరించింది. ‘‘రోజుల తరబడి రోడ్లను బ్లాక్ చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆల్టర్నేట్ రూట్లలో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి  వస్తుండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పేషెంట్లు, వికలాంగులు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది” అని పేర్కొంది. వీటన్నింటిపై తీసుకున్న చర్యలపై రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీఎస్‌లు, ఢిల్లీ పోలీస్ కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది ఎన్‌హెచ్‌ఆర్సీ.