ఒక చేత్తో ఆటో డ్రైవింగ్.. మరో చేత్తో శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్.. ప్రయాణికుడు సీరియస్!

ఒక చేత్తో ఆటో డ్రైవింగ్.. మరో చేత్తో శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్..  ప్రయాణికుడు సీరియస్!

భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు అన్ని ఇన్ని కావు. నిత్యం లక్షలాది మంది ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అలాంటి నగరంలో, ఒక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యపూరిత చర్య ప్రయాణికుడిని ఆగ్రహానికి గురిచేయడమే కాకుండా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చకు దారితీసింది. నడుస్తున్న వాహనంలో, ఒక తెలుగు నటి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను బ్రౌజ్ చేయడం కోసం ఆటో డ్రైవర్ వేగం తగ్గించడం, ప్రయాణికుడిని కోపంతో, నిస్సహాయంగా మార్చింది..

ఒక చేత్తో ఆటో డ్రైవ్.. మరో చేత్తో శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ చూస్తూ.. 
రెడిట్ యూజర్ Bangalore సబ్‌రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకుంటూ, "డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వారు తమ ఫోన్‌లను పక్కన పెట్టలేరా?" అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక ముఖ్యమైన కాల్ కోసం 20 నిమిషాల్లో నా ఆఫీసుకు చేరుకోవాల్సిన అవసరం ఉన్నందున నేను ఉబర్ ద్వారా ఆటో బుక్ చేసుకున్నాను. నా ఆఫీసు నుండి ఆఫీసు సాధారణంగా 10 నిమిషాల ప్రయాణంలో ఉంటుంది, కాబట్టి నేను సౌకర్యవంతంగా సమయానికి చేరుకోగలనని అనుకున్నాను . నేను ఆటో ఎక్కిన వెంటనే, డ్రైవర్ మ్యాప్‌ని క్లుప్తంగా చూసి, ఆపై దానిని తగ్గించాడు. అతను రూట్ గురించి తెలుసుకున్నాడని భావించా. కానీ ఆశ్చర్యంగా ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ..  అతను వెంటనే ఇన్‌స్టాగ్రామ్ తెరిచి స్క్రోల్ చేయడం ప్రారంభించాడని అని పోస్ట్ చేశారు.

ALSO READ : Shah Rukh Khan: షూటింగ్ లో గాయపడిన షారూఖ్ : అమెరికాలోని ఆస్పత్రిలో ట్రీట్ మెంట్

ఈ సంఘటనలో  అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే .. డ్రైవర్ తెలుగు నటి శ్రీలీల పోస్ట్ చూస్తున్నారు . అంతటితో ఆగకుండా ఆమె ప్రొఫైల్ ను బ్రౌజ్ చేస్తూ..  ప్రధాన రహధారిపై ఆటో వేగాన్ని తగ్గించి నడుపుతున్నారు. నాకు కోపం వచ్చింది, పూర్తిగా నిస్సహాయంగా అనిపించింది. ప్రయాణం ఇప్పుడే మొదలైంది,  సమయం కాస్త అయితుందని నాకు అప్పుడే అనిపించింది," అని రెడిట్ లో ఆ యూజర్ రాసుకొచ్చారు..

వైరల్‌గా మారిన పోస్ట్..
సుమారు తొమ్మిది గంటల క్రితం ప్రచురించబడిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది, రెడిట్‌లో వినియోగదారుల నుండి అనేక స్పందనలు వచ్చాయి. ఒక యూజర్, "ఆటో డ్రైవర్లు ఫ్లైట్ మోడ్‌లో ఉండకూడదా?" అని వ్యాఖ్యానించాడు. మరొక యూజర్, "మీకు ఎందుకు నిస్సహాయంగా అనిపించింది? మీరు తొందరగా వెళ్లాలని చెప్పలేదా?" అని ప్రశ్నించాడు. ఈ సంఘటన కేవలం వ్యక్తిగత అసౌకర్యం మాత్రమే కాదు, ప్రయాణీకుల భద్రత, డ్రైవర్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. డిజిటల్ పరధ్యానం డ్రైవింగ్‌లో ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇది స్పష్టం చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.