హైదరాబాద్–భోపాల్ ఉగ్ర కేసుపై NIA దర్యాప్తు

హైదరాబాద్–భోపాల్ ఉగ్ర కేసుపై NIA దర్యాప్తు

హైదరాబాద్- భోపాల్ ఉగ్ర కేసుపై NIA (National Investigation Agency) దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే HUT కి చెందిన 17 మందిని నిందితులను భోపాల్ ATS (Anti–Terrorism Squad) బృదం అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో ఆరుగురు, భోపాల్ లో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఈ కేసును NIA కి బదిలీ చేశారు. దేశంలో పేలుళ్ళకు కుట్ర చేసిన HUT (Hizb–Ut–Tahrir)పై కేసు నమోదు చేసిన NIA.. నిందితులను పలు కోణాల్లో విచారిస్తోంది.

నిందితుల విదేశీ లింక్స్, ఆర్థిక మూలలపై దృష్టి పెట్టారు అధికారులు. NIA అధికారులు నిందితుల ల్యాప్ టాప్స్ ఫోన్లలో ఉన్న డేటాను సేకరించే పనిలో పడ్డారు. నిందితులు ఎక్కడెక్కడ శిక్షణ ఇచ్చారు.. ఎక్కడెక్కడ శిబిరాలు నిర్వహించారనే వివరాలు సేకరిస్తున్నారు.