పీఎఫ్ఐ కేసు..ఆటో డ్రైవర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

పీఎఫ్ఐ కేసు..ఆటో డ్రైవర్ ఇంట్లో ఎన్ఐఏ  సోదాలు

తమిళనాడులోని నేలపట్టయ్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇంటిపై ఎన్ఐఏ దాడుల నిర్వహించింది. నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలున్నాయనే అనుమానంతో తెల్లవారుజామున 4 గంటలకు ఉమర్ షరీఫ్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని చెన్నై తరలించారు. అతడు తన ఇంటి సమీపంలో సిలంబమ్ కళను నేర్పిస్తున్నట్లు సమాచారం.  


 
ఇటీవలె పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐ‌తో పాటు దాని అనుబంధ సంస్థలైన CFI, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, రిహాబ్ఇండియా ఫౌండేషన్, నేషనల్ ఉమెన్ ఫ్రంట్ సంస్థలను కూడా చట్ట విరుద్ధమైన సంస్థలుగా ప్రకటించింది. క్రిమినల్, టెర్రర్ చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నందున UAPA కింద విచారణకు కేంద్రహోంశాఖ గెజిట్ విడుదల చేసింది.  కేరళ, కర్ణాటక  సహా పలు రాష్ట్రాలలో పలు హత్యలకు పాల్పడడం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఐసిస్, సిమి లాంటి సంస్థలతో సంబంధాలు కలిగి ఉండడం ఇందుకు అసలైన కారణాలుగా తెలుస్తోంది. విదేశాల నుంచి హవాలా మార్గాల్లో భారీగా నిధులు సమీకరించినట్టు సమాచారం.