వీక్షణం పత్రిక ఎడిటర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

వీక్షణం పత్రిక ఎడిటర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు 2024 ఫిబ్రవరి 8 తెల్లవారుజాము నుంచే సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

వరవరరావు అల్లుడు వేణుగోపాల్ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్న నేపథ్యంలో హిమాయత్ నగర్ లోని ఆయన ఇంట్లో ఈ రైడ్స్ జరుపుతున్నారు అధికారులు. అలాగే, ఎల్ బీ నగర్ లోని రవి శర్మ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.

ఇదిలా ఉంటే మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ..  గత కొంత కాలం నుంచి మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ లోని రవిశర్మ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.