USAలో భారత కాన్సులేట్‌ విధ్వంసం నిందితుల ఫొటోలు విడుదల

USAలో భారత కాన్సులేట్‌ విధ్వంసం నిందితుల ఫొటోలు విడుదల

ఖైస్తానీ ఉగ్రవాదులపై ఇప్పటికే అణిచివేత ప్రారంభించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA).. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి, విధ్వంసం కేసులో 10 మంది నిందితుల ఫొటోలను విడుదల చేసింది. వాంటెడ్ నిందితుల చిత్రాలను విడుదల చేసింది.

పంజాబ్ లో ఖలిస్తానీ మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ తర్వాత మార్చిలో  అమెరికాలోని భారత కాన్సులేట్ పై దాడి జరిగింది. ఈ దాడిలో పాల్గొన్న 10 మంది నిందితుల ఫొటోలను ఎన్ ఐఏ గురువారం విడుదల చేసింది.

శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్‌పై దాడి 2023 మార్చి 18, 19 తేదీల్లో రాత్రి జరిగింది.  కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు కాన్సులేట్ లోకి చొరబడి ధ్వంసం చేశారు. కాన్సులేట్ లోని అధికారులను గాయపర్చారు. అంతేకాకుండా జూలై 1, 2 తేదీల్లో  కొంతమంది నిందితులు కాన్సులేట్ లో చొరబడి అధికారులు భవనంలో ఉండగానే  కాన్సులేట్ కు నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు. 

ఈ ఘటన తర్వాత ఎన్ ఐఏ.. నిందితులకోసం మూడు వేర్వేరు ఐడెండిఫికేషన్, ఇన్ ఫర్మేషన్ నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసుల ద్వారా మొత్తం 10 మంది నిందితులను గుర్తించింది. 
ఈ 10 మంది నిందితులకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని పంచుకోవడానికి NIA కింది టెలిఫోన్ నంబర్లు, ఇమెయిల్ IDలను విడుదల చేసింది. నిందితుల సమాచారాన్ని పంచుకునే వారి  వివరాలను రహస్యంగా ఉంచుతామని ఏజెన్సీ హామీ ఇచ్చింది.

 
1. NIA హెడ్‌క్వార్టర్ న్యూ ఢిల్లీ కంట్రోల్ రూమ్ -టెలిఫోన్ నంబర్: 011-24368800,

WhatsApp/టెలిగ్రామ్: +91-8585931100

ఇమెయిల్ ID: do.nia@gov.in

2. NIA బ్రాంచ్ ఆఫీస్ చండీగఢ్ -టెలిఫోన్ నంబర్: 0172-2682900, 2682901

వాట్సాప్/టెలిగ్రామ్ నంబర్: 7743002947

టెలిగ్రామ్: 7743002947

ఇమెయిల్ ID: info-chd.nia@gov.in