V6 News

పోలీసులకు ఇంకా చిక్కని నిదా ఖాన్ ఆచూకీ... బంధువుల ఇంట్లో సోదాలు

పోలీసులకు ఇంకా చిక్కని నిదా ఖాన్ ఆచూకీ... బంధువుల ఇంట్లో సోదాలు

ముంబై: నాసిక్ టీసీఎస్  లైంగిక వేధింపులు, మత మార్పిడి రాకెట్ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిదా ఖాన్ భర్తను విచారించగా.. ఆమె తమ బంధువుల ఇంట్లో ఉన్నట్లు అతను సమాచారం ఇచ్చాడు. అయితే, పోలీసులు అక్కడికి వెళ్లేసరికే ఇంటికి తాళం వేసి  ఉంది. నిదా ఖాన్‌‌‌‌తో పాటు ఆమె బంధువుల మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్​లో ఉన్నాయి. దాంతో నిందితురాలని ట్రేస్ చేయడం పోలీసులకు సవాలుగా మారింది. 

మరోవైపు, నిదా ఖాన్ తన న్యాయవాది ద్వారా నాసిక్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాను గర్భవతినని, ప్రస్తుతం ముంబైలో ఉన్నానని తన పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. 

నిదా ఖాన్ గతంలో హెచ్‌‌‌‌ఆర్ హెడ్ అని ప్రచారం జరిగినప్పటికీ..  ఆమె  టెలికాలర్‌‌‌‌గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో.. డిజిటల్ ఫుట్‌‌‌‌ప్రింట్స్ ఆధారంగా ఆమెను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.