
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. బంగారు రంగు చీర, నగలతో మెరుస్తోంది నిధి. ఇందులో ఆమె పంచమి అనే పాత్రలో నటిస్తోంది.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రిష్ కొంత చిత్రీకరించగా.. కొద్ది రోజుల క్రితం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. కొంత విరామం తర్వాత ఆగస్టు 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభించారు. యాక్షన్ డైరెక్టర్ స్టంట్ సిల్వ పర్యవేక్షణలో యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.