21,400 దిగువకు నిఫ్టీ.. భారీగా షేర్లను అమ్మేస్తున్న విదేశీ  ఇన్వెస్టర్లు 

21,400 దిగువకు నిఫ్టీ.. భారీగా షేర్లను అమ్మేస్తున్న విదేశీ  ఇన్వెస్టర్లు 

 ముంబై :  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బేర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిపత్యం కొనసాగుతోంది.  బుధవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రికవరీ అయినప్పటికీ, గురువారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 101 పాయింట్లు పడి 21,353 దగ్గర,  సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 360 పాయింట్లు (0.51 శాతం) నష్టపోయి 70,701 దగ్గర సెటిలయ్యాయి. ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో  అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు) పెద్ద మొత్తంలో షేర్లను అమ్మేస్తున్నారు. బుధవారం  నికరంగా రూ.6,935 కోట్ల విలువైన షేర్లను వీరు అమ్మగా, గురువారం నికరంగా మరో రూ.2,144 కోట్ల విలువైన షేర్లను సేల్ చేశారు.

డొమెస్టిక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు గురువారం  నికరంగా రూ. 3,474.89 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెరగడం, కార్పొరేట్ కంపెనీల క్యూ3 రిజల్ట్స్ మెప్పించకపోవడంతో  మార్కెట్ పడుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు.  ఐటీ, ఫార్మా, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ షేర్లు గురువారం నష్టాల్లో క్లోజవ్వగా, రియల్టీ, ఎనర్జీ షేర్లు లాభాల్లో కదిలాయి. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెక్ మహీంద్రా  టాప్ లూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. క్యూ3  ప్రాఫిట్ 60 శాతానికి పైగా తగ్గడంతో కంపెనీ షేర్లు 6 శాతానికి పైగా క్రాష్ అయ్యాయి.

యూఎస్ జీడీపీ 3.3 శాతం అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యూఎస్ జీడీపీ కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ4) లో  3.3 శాతం (ఏడాది ప్రాతిపదికన) వృద్ధి చెందింది. అంతకు ముందు క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ3) లో 4.9 శాతం గ్రోత్ రేట్ సాధించింది. క్యూ4 లో యూఎస్ జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 శాతం నమోదవుతుందని  ఎనలిస్టులు అంచనా వేశారు. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకానమీ మెరుగ్గా ఉండడంతో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడాన్ని ఆలస్యం చేస్తుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.