
న్యూఢిల్లీ: వినసొంపైన సంగీతానికి లయ బద్ధమైన డ్యాన్సింగ్ మూవ్స్‌తో కళాత్మక రూపం ఇవ్వడమే బ్యాలెట్ డ్యాన్స్. ఇది ఫారెన్ కంట్రీస్‌లో చాలా పాపులర్. షూ వేసుకొని కాలి మడమల మీద గ్రేస్‌ఫుల్ మూమెంట్స్‌తో డ్యాన్సర్స్ బ్యాలెట్ పెర్ఫామ్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవంటే నమ్మండి. అలాంటిది నైజీరియాకు చెందిన11 ఏళ్ల ఆంథోని మెసోమా మడు అనే పిల్లాడు కాళ్లకు చెప్పులు లేకుండా అద్భుతమైన బ్యాలెట్ స్టెప్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.
గత నెలలో వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 15 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వీడియోను చూశారు. ఈ డ్యాన్స్‌కు ఆఫ్రికన్ దేశాల్లో అంతగా పాపులారిటీ లేదు. అయితే సదరు వీడియోను ప్రఖ్యాత అమెరికన్ బ్యాలెట్ థియేటర్ కూడా చూసింది. మెసోమా ప్రదర్శనకు ఇంప్రెస్ అయి స్కాలర్షిప్ కూడా ప్రకటించింది. ఈ సమ్మర్లో వర్చువల్ ట్రెయినింగ్ కోసం ఇంటర్నెట్ యాక్సెస్ సదుపాయం కూడా కల్పించింది. బ్యాలెట్ బియాండ్ బార్డర్స్ స్కాలర్‌షిప్‌తో వచ్చే ఏడాది అమెరికాలో సదరు పిల్లాడు ట్రెయినింగ్ తీసుకోనున్నాడు.
‘నేను డ్యాన్స్ చేసినప్పుడు ప్రపంచంలోని అత్యంత ఎత్తులో నేనున్నానని భావిస్తా. నేను డ్యాన్స్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ చూసి నేను ఏదో ఫారెన్ డ్యాన్స్ చేస్తున్నానని అనుకున్నారు. నేనిప్పుడు యూఎస్‌కు వెళ్లే గొప్ప అవకాశం దక్కించుకున్నా. నేను విమానంలో వెళ్తా. దీని కోసం నేను ఎదురుచూస్తున్నా. బ్యాలెట్ వల్లే ఇది సాధ్యమైంది’ అని మెసోమా చెప్పాడు. నైజీరియాలోని లాగూన్ సిటీలో మెసోమా తన పేరెంట్స్‌తో కలసి ఉంటున్నాడు.